టీఆర్ఎస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బావమరిది తిట్లపురాణం

by  |
TRS
X

దిశ నల్గొండ: ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేకి స్వయాన బావమరిది. ఆ నియోజకవర్గంలో బావ వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. పార్టీ వ్యవహారాలతో పాటు అధికారిక వ్యవహారాల్లోనూ బావమరిది పాల్గొంటారు. కొందరు ఆ బావ మెచ్చిన బావమరిది అని, అక్కడ షాడో ఎమ్మెల్యే అని కూడా అంటుంటారు. ఆయన ఎవరో కాదు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ముద్దుల బావ మరిది సంపత్ యాదవ్. ఈ మధ్య ఆయన దూకుడు వ్యవహారం సొంత పార్టీ టిఆర్ఎస్ పెద్దలకు కూడా తలనొప్పిగా మారిందట! తాజాగా పార్టీ కార్యకర్తను ఫోన్‌లో దూషించిన ఘటన గులాబీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

తిరుమలగిరి సాగర్ మండలం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనాథ్‌ను భూతులు తిట్టిన వాయిస్ బయటికి రావడంతో.. ఎమ్మెల్యే బావ మరిది తీరుపై టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి యువసేన గ్రూప్‌లో శ్రీనాథ్.. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యను విమర్శిస్తూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఆ గ్రూపులో ఉన్న సంపత్ కామెంట్‌ను చూసి తన బావకు వ్యతిరేకంగా పెడుతావా అంటూ ఇష్టమొచ్చిన భూతులు తిట్టారు. నువ్వెంతా… నీ బతుకెంతా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి శ్రీనాథ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణ ఆడియో రికార్డ్ నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డ్ విన్న టిఆర్ఎస్ శ్రేణులు మాత్రం సంపత్ తీరును తప్పుపడుతున్నారు. నోముల నర్సింహయ్యను ఆదరించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల, కార్యకర్తల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉందంటున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags: viral audio, mla relative, trs activist, nagarjuna sagar, nomula narsimhaiah


Next Story

Most Viewed