SEX సీన్స్ చేసేది అందుకోసమే : త్రిధా చౌదరి

by  |
SEX సీన్స్ చేసేది అందుకోసమే : త్రిధా చౌదరి
X

దిశ, సినిమా : హీరోయిన్ త్రిధా ‘ఆశ్రమ్’ సిరీస్‌తో ఫేమ్ సంపాదించింది. అంతకు ముందు తెలుగు, బెంగాలీ సినిమాల్లో కనిపించినా సరే ‘ఆశ్రమ్’ సిరీస్‌లో చేసిన బోల్డ్ అండ్ హాట్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది. అయితే ఇందులో సెక్స్ వర్కర్‌గా కనిపించిన తనపై సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోల్స్ రావడంపై త్రిధ స్పందించింది. సినిమాల్లో, సిరీస్‌లో చేసిన పాత్రతో రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను అంచనా వేయడం సరికాదని ఫైర్ అయింది. ‘ఆశ్రమ్’ సిరీస్‌లో చేసిన ఇంటిమసీ సీన్స్‌లో అంత బోల్డ్‌గా కనిపించానంటే.. ఆ క్రెడిట్ తనది కాదని, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందుతుందని వివరించింది.

సెక్స్ సీన్స్ చేస్తున్నప్పుడు నటులు ఆందోళన చెందుతారని, యూనిట్ సభ్యులపై పూర్తి భరోసా ఉంచి ఇలాంటి సీక్వెన్స్ చేసేందుకు అంగీకరిస్తారని తెలిపింది. అయినా నటులు సెక్స్ సీన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవడం నిజంగా ఫులిష్‌నెస్ అవుతుందని అభిప్రాయపడింది. సమాజంలో మార్పు కోసమే బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసేందుకు ముందుకొస్తున్నవారు చాలా మంది ఉన్నారని వివరించింది. కానీ ఇంటిమేట్ సీన్స్‌ను పోర్న్ సైట్స్ యూజ్ చేయడం వల్ల నటులపై నెగెటివిటీ ఏర్పడుతుందని, ఇలాంటి తప్పు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి వారిని శిక్షించేందుకు భారతప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని కోరింది.

Next Story

Most Viewed