- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్‌లో ఏకే 47లతో భద్రత! వీడియో వైరల్
పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన మరో సంచలన విషయం బయటకు వచ్చింది. గతంలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌లోని లాహోర్ గల అనార్కలి బజార్‌లో తిరుగుతుండగా, (AK-47) ఏకే-47 రైఫిల్స్‌తో సాయుధంగా ఉన్న దాదాపు ఆరుగురు వ్యక్తులు ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ (Callum Mill) ఈ దృశ్యం చూసి షాక్ అవుతాడు.
కల్లమ్ అబ్రాడ్ (Callum Abroad) అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న కల్లమ్ మిల్ మార్చిలో పాక్‌లో పర్యటిస్తారు. లాహోర్‌లోని అనార్కలి బజార్‌ను సందర్శించినప్పుడు అతను తుపాకులు ధరించిన వారి వీడియోలు చిత్రికరిస్తాడు. అప్పుడు యాదృచికంగా అక్కడ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా కన్పిస్తోంది. సాధారణ దుస్తులతో తుపాకులు కలిగి ఉండి, "నో ఫియర్" అని రాసిన జాకెట్లు ధరించిన వ్యక్తులు జ్యోతికి ఎస్కార్ట్‌గా ఉండటం చూస్తాడు. వెంటనే కల్లమ్ తనను తాను స్కాటిష్ యూట్యూబర్‌గా జ్యోతితో పరిచయం చేసుకుంటాడు.
పాకిస్తాన్‌కు ఇది అతని మొదటి సందర్శననా అని యూట్యూబర్ జ్యోతి అడుగుతుంది. దీనికి, కల్లమ్ లేదు, ఐదోసారి రావడమని సమాధానం ఇస్తాడు. భారత్‌కు వచ్చావా? తను ఇండియన్ అని, భారత్ నుంచి వచ్చానని జ్యోతి పరిచయం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆతిథ్యం గురించి జ్యోతిని కల్లమ్ అడుగుతాడు. అందుకు జ్యోతి ‘అవును చాలా బాగుంది’ అని సమాధానం ఇస్తోంది. అనంతరం కల్లమ్ ఆమెకు భద్రత చూడండి.. ఎందుకు భద్రత కల్పిస్తున్నారో తెలియదు. ఆమె చుట్టూ ఉన్న తుపాలకును చూడండి.. దాదాపు ఆరుగురు వ్యక్తులు ఉన్నారు.. అని కల్లమ్ వీడియో షేర్ చేస్తారు. భారతీయ అమ్మాయి "పూర్తిగా ప్రేమించే" పాకిస్తాన్.. అంటూ కల్లమ్ తన కల్లమ్ అబ్రాడ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో వీడియో రెండు నెలల క్రితం పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో జ్యోతి మల్హోత్రాకు భద్రత ఇవ్వడంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఆమెకు పాక్ వ్యక్తులు భద్రత ఇవ్వడంపై వివరాలు తెలియాల్సి ఉంది.






