- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలనుకుంటున్నారా? ఈ ఫీచర్ మీకోసమే..
ఏ ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు.. మీలో ఉన్న టాలెంట్ తో వీడియోలు చేసి మీకంటూ కొంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

దిశ, వెబ్‌డెస్క్: ఏ ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు.. మీలో ఉన్న టాలెంట్ తో వీడియోలు చేసి మీకంటూ కొంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ (Youtube Income) ద్వారా చాలామంది చేస్తున్న పని ఇదే. ఇక్కడ కనిపించని కంటెంట్ అంటూ ఉండదు. వంటలు, ఆటలు, పాటలు, కామెడీ, అబ్బో ఇంకా చాలానే ఉంటాయి. అలా ఎవరి టాలెంట్ వాళ్లు ప్రదర్శిస్తూ కొన్నాళ్లకు పాపులర్ అయి ఎంతోకొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే కొందరు కంటెంట్ క్రియేటర్లు మాత్రం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదని నిరాశ చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వారు వీడియోల రీచ్ కోసం నానా తంటాలూ పడుతారు. సబ్ స్క్రైబర్లు, వ్యూయర్ షిప్ ను పెంచుకునేందుకు చాలా ప్రయత్నిస్తారు. అలాంటి వారికోసం యూట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే హైప్.
500 నుంచి 5 లక్షల వరకూ సబ్ స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ ను (Youtube Hype) యూజ్ చేసుకోవచ్చు. మీకు 500కు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నట్లైతే.. ఛానల్ కింద హైప్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొన్ని వీడియో పాయింట్స్ యాడ్ అవ్వడంతో వీడియో ఎక్కువమందికి రీచ్ అయ్యేందుకు యూజ్ అవుతుంది. అలా హైప్ అయిన వీడియో పాయింట్స్ బేస్ పై టాప్ 100 లిస్ట్ లోకి చేరుతుంది. యూజర్లు కూడా తాము చూసే వీడియోలకు లైక్, షేర్ తరహాలోనే హైప్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వీడియోకి హైప్ ఇవ్వొచ్చు. ఫలితంగా వీడియోకి ఎక్కువ హైప్స్ వస్తే రికమెండేషన్ సెక్షన్లో వీడియో కనిపించి రీచ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.






