"శ్రీకృష్ణుడే నా భర్త.." విగ్రహాన్ని వివాహం చేసుకున్న యువతి

by Muthe.Rajitha |

శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే ఓ యువతి, శ్రీకృష్ణుడే తన భర్తగా ప్రకటించుకుంది.

శ్రీకృష్ణుడే నా భర్త.. విగ్రహాన్ని వివాహం చేసుకున్న యువతి
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే ఓ యువతి, శ్రీకృష్ణుడే తన భర్తగా ప్రకటించుకుంది. అంతే కాదు ఏకంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు జిల్లా బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. అయితే పింకీ నిర్ణయాన్ని స్వాగతించిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి శ్రీకృష్ణుడి విగ్రహంతో జరిపించారు. వివాహానికి గుర్తుగా పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ పలుచోట్ల జరిగిన సంగతి తెలిసిందే.

Next Story