- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"నేను బట్టలు విప్పనా.. నువ్వు విప్పుతావా.." చేతిలో తాళి పట్టుకుని ఆమె అన్న మాటలు వింటే..
ప్రేమించి, అతనికే అన్నీ అర్పించిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని చేతిలో తాళి పట్టుకుని అడుగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ.. నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే పెళ్లి కాకుండానే అన్నీ అయిపోవాలన్న ఆలోచన రాకూడదు కదా. మనసు ఇంకో మనసుతో ముడిపడింది.. అప్పుడే మనకు పెళ్లైపోయింది. తాళి కడితేనే పెళ్లా.. ఇలా కూడా నేను నిన్ను మనువాడాను అని మాయమాటలు చెప్పి.. అవసరం తీరాక మొఖం చాటేస్తున్నవారెందరో. వారి మాటలు నమ్మి.. అడిగిందల్లా ఇచ్చి మోసపోతున్నావారెందరో. ఇక్కడ ఆడ, మగ అన్న తేడా లేదు. ప్రేమ పేరుతో అబ్బాయిలు కామవాంఛ తీర్చుకుని వదిలించుకుంటుంటే.. అదే ప్రేమ పేరు చెప్పి అమ్మాయిలు.. తమ అవసరాలను తీర్చుకుంటూ, టూర్లు, షికార్లు అని తిరిగి ఫుల్లుగా వాడుకుని వదిలేస్తున్నారు. ప్రేమలో మోసపోయామని అనేక మంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.
తాజాగా ఓ యువతి చేతిలో తాళి పట్టుకుని.. అన్నీ తీసుకున్నావ్ కదా.. తాళి కట్టడానికి ఏం అడ్డొస్తుందని అడుగుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అప్పలనాయుడు కెల్లాయ్ టీడీపీ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో యువతను కదిలిస్తోంది. "మోసం చేయడం తెలియని అమ్మాయిలందరూ మోసం చేసే అబ్బాయిలకే పడతారు. అలాగే మోసం చేయడం తెలియని అబ్బాయిలకు మోసం చేసే అమ్మాయిలే దొరుకుతారు. ఇదే విధి." అని ఆ వీడియోకి ఒక లైన్ క్యాప్షన్‌గా ఇచ్చారు.
ఏ స్వార్థం లేనపుడు తాళి కట్టడానికి ఏంటి? నీలో ఏ స్వార్థం లేకుండా తోడుంటానని, నిజాయితీగా తోడుంటానని వచ్చి అన్నీ తీసుకున్నావ్ కదా. తాళి కట్టు అంటుంటే ఆ అబ్బాయి నోరు మెదపకుండా స్తబ్దుగా చూస్తుండిపోయాడు. చివరికి "నేను బట్టలు విప్పనా.. నువ్వు విప్పుతావా.. పడుకుందామా" అని ఆ అమ్మాయి అడుగుతున్న తీరు వింటుంటే ఏ మనసైనా చలించాల్సిందే. పాపం ఎంత నమ్మిందో అని కొందరు అంటుంటే.. పెళ్లికి ముందే అన్నీ కావాలనుకుని పడుకుందని, ఇలాంటి వాళ్లకి అలాగే జరుగుతుందని మరికొందరు అంటున్నారు.






