- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు నెలల పాపను కాపాడిన యువకుడు.. థాంక్స్ చెప్పాల్సింది పోయి రూ. 5కోట్ల పరిహారం చెల్లించాలని కేసు వేసిన తల్లి.. చివరకు..
టెక్సాస్‌లో రోడ్డుపై వెళ్తున్న జాసన్ అనే యువకుడు.. అనుకోకుండా ఓ పాపను కాపాడాడు. బాల్కనీ నుంచి ఏడుపు వినిపించడంతో.. పైకి చూడగా ఐదో అంతస్తు నుంచి కిందపడుతూ కనిపించింది ఐదు నెలల పాప. దీంతో అతను అలర్ట్ అయి పాపను కాపాడేందుకు పట్టుకున్నాడు

దిశ, వెబ్ డెస్క్ : టెక్సాస్‌లో రోడ్డుపై వెళ్తున్న జాసన్ అనే యువకుడు.. అనుకోకుండా ఓ పాపను కాపాడాడు. బాల్కనీ నుంచి ఏడుపు వినిపించడంతో.. పైకి చూడగా ఐదో అంతస్తు నుంచి కిందపడుతూ కనిపించింది ఐదు నెలల పాప. దీంతో అతను అలర్ట్ అయి పాపను కాపాడేందుకు పట్టుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం 911కు కాల్ చేసి.. ఆ పాపతో ఉండి మరీ ట్రీట్మెంట్ చేయించాడు. హాస్పిటల్ ఖర్చులు కూడా కొన్ని భరించాడు. ముందుగా పాప తల్లిదండ్రులు థాంక్స్ చెప్పినా.. తర్వాత అతను అజాగ్రత్తగా పట్టుకోవడం వల్లే పాపకు గాయాలయ్యాయని కేసు వేశారు. ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టుకు ఎక్కారు.
ఈ కేసు విచారణ సందర్భంగా కూడా కోర్టులో పాప తల్లి డ్రమాటిక్‌గా బిహేవ్ చేసింది. ప్రొఫెషనల్ రెస్క్యూయర్స్ చేసే పని అతను ఎందుకు చేశాడని ప్రశ్నించింది. అతను సరిగ్గా పట్టుకోకపోవడం వల్లనే పాపకు దెబ్బలు తగిలాయని.. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ భరించాలని డిమాండ్ చేసింది. ఇదంతా విన్న జడ్జి తీవ్రంగా స్పందించారు. హెల్ప్ చేస్తే థాంక్స్ చెప్పాల్సింది పోయి పరిహారం ఎక్స్‌పెక్ట్ చేయడమేంటని ఫైర్ అయ్యారు. అతను మీకు ఐదు కోట్లు చెల్లించడం కాదు.. మీరే అతన్ని మెంటల్‌గా డ్యామేజ్ చేసినందుకు రూ. 27లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చాడు. దీంతో కోర్టులో ఆనందం నెలకొంది.






