- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suitcase Lover: అందరి ముందు పరువుపోయిందిగా! గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాచిపెట్టీ.. బాయ్స్ హాస్టల్‌కు..
హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను (suitcase) సూట్‌కేస్‌లో పెట్టుకుని బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీకి చిక్కాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి (girlfriend) సూట్‌కేస్‌లో దాక్కోని ఉండగా, సెక్యూరిటీ గార్డులు ఆ సూట్‌కేస్‌ను తెరుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తోటి విద్యార్థి ఆ క్షణాన్ని కెమెరాలో రికార్డు చేశాడు. యూనివర్సిటీకి చెందిన గార్డులు సూట్‌కేసులో అమ్మాయి ఉందని ఎలా కనుగొన్నారనేది అస్పష్టంగానే ఉంది. అమ్మాయి అదే విశ్వవిద్యాలయ విద్యార్థినా? లేదా బయటి వ్యక్తినా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
దొంగతనంగా హాస్టల్‌కు తన స్నేహితురాలిని లగేజీలా ప్యాక్ చేసి తీసుకొస్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చిందని, దీంతో సూట్‌కేస్ చెక్ చేశారని యూనివర్సిటీలో టాక్ నడుస్తోంది. వారిపై యాజమాన్యం చర్యలు తీసుకోబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక, ఇందుకు సంబంధించిన వీడియోలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సూట్‌కేస్ లవర్.. పాపం అందరి ముందు పరువుపోయిందిగా.. అని ఓ నెటిజన్ సానుభూతి చూపిస్తూ కామెంట్ పెట్టారు. మా హాస్టల్ లో కూడా ఇలాంటి ఘటననే జరిగిందని మరో వ్యక్తి తన అనుభవాన్ని కామెంట్ పెట్టారు. సూట్‌కేసు ఘటనల్లో మొదటి సారి జీవించి ఉన్నా అమ్మాయి చూడటం అని మరో నెటిజన్ సెటైరికల్ కామెంట్ పెట్టారు. ఇకపై సూట్‌కేసు అడ్వటైజ్‌మెంట్స్ ఇలానే వస్తాయని అంటున్నారు. ఇలా సెక్యూరిటీకి పట్టుబడే బదులు ఓయో రూమ్‌కి వెళ్లాల్సిందని చాలా మంది నెటిజన్లు సూచనలు ఇచ్చారు.






