కొంపముంచిన మేకప్.. బ్యూటిషియన్ ప్రయోగానికి ఉబ్బిపోయిన వధువు ముఖం, పెళ్లి క్యాన్సిల్

by Ajay Maddhiboyina |

కర్నాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు రోజు యువ‌తి స్థానికంగా ఉన్న గంగ అనే బ్యూటీషిన్ కు చెందిన పార్ల‌ర్‌కు వెళ్లింది. అక్కడ బ్యుటిషియన్ ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తరవాత స్టీమ్ పెట్టగా కొద్దిసేపటికే యువతి ముఖం మంటలతో ఉబ్బిపోయింది.

కొంపముంచిన మేకప్.. బ్యూటిషియన్ ప్రయోగానికి ఉబ్బిపోయిన వధువు ముఖం, పెళ్లి క్యాన్సిల్
X

దిశ‌, వెబ్ డెస్క్: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకున్న వధువుకు ఆమె వేసుకున్న మేకప్ శాపంగా మారింది. అందంగా కనిపించకపోగా అందవికారంగా అవ్వడంతో ఆ యువతి పరిస్థితి చివరికి ఐసీయూలో చేరేవరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు రోజు యువ‌తి స్థానికంగా ఉన్న గంగ అనే బ్యూటీషిన్ కు చెందిన పార్ల‌ర్‌కు వెళ్లింది. అక్కడ బ్యుటిషియన్ ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తరవాత స్టీమ్ పెట్టగా కొద్దిసేపటికే యువతి ముఖం మంటలతో ఉబ్బిపోయింది. అయినప్పటికీ ఆ యువతి మరుసటి రోజు ఉదయం అలానే మండపానికి వెళ్లగా పెళ్లి కొడుకు ఆమెను చూసి కంగు తిన్నాడు. అతడు ఆ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.

యువతి కుటుంబ సభ్యులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతడు అంగీకరించలేదు. దీంతో పెళ్లి ఆగిపోగా యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెను ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. ఈ ఘటనపై యవతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మేకప్ ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ ఘటన 2023లో జరగ్గా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అమ్మాయిలు అందం కోసం రసాయనాలు ఉండే ప్రోడక్ట్స్ వాడకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు. అందం కోసం పోతే ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Next Story