వావ్.. ఏమన్నా డ్యాన్సా.. మైఖేల్ జాక్సన్‌ను గుర్తుచేశాడుగా!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-17 13:07:54  IST  )

ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వావ్.. ఏమన్నా డ్యాన్సా.. మైఖేల్ జాక్సన్‌ను గుర్తుచేశాడుగా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ (Michael Jackson) డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మూన్ వాక్, రోబోట్, యాంటీ-గ్రావిటీ లీన్ వంటి స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, అలాంటి క‌ష్ట‌మైన స్టెప్పుల‌ను చాలా ఈజీగా చేసి చూపించాడు ఓ యువ‌కుడు. నడి వీధిలో తన స్టెప్పులతో అదరగొట్టాడు. తన స్టన్నింగ్‌ స్టెప్పులతో అక్కడి జనాలను షాకింగ్‌కు గురిచేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో రద్దీ రోడ్లపై ఓ యువకుడు తన సూపర్ స్ట్రిట్ డ్యాన్స్‌తో జనాలను కట్టిపడేశాడు. చక్కటి రోబోటిక్ మూవ్స్, మూన్ వాక్‌తో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. కాగా, అతని స్టన్నింగ్‌ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే గట్స్‌ ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/RandomTheGuy_/status/1912163549801058535

Read More..

Trending Video: ఏందిరా అయ్యా.. ఇది ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Next Story