- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: వావ్.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
అందంగా రెడీ అవ్వటమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి.

దిశ, వెబ్ డెస్క్: అందంగా రెడీ అవ్వటమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. కొత్త మంది బయటకి వెళ్లేటప్పుడూ లేదా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే రెడీ అవుతే.. మరికొందరు ఇంట్లో ఉన్న కూడా నీట్‌గా రెడీ అవుతుంటారు. ఇక చాలామంది మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా ట్రెండ్ ఫాలో అయ్యేందుకు ఇష్టపడుతుంటారు. అబ్బాయిలు అయితే తమకు ఇష్టమైన హీరోల హెయిర్ స్టైల్స్‌ను కూడా అనుకరిస్తుంటారు. ఇదంతా సర్వ సాధారణమైన విషయం. కానీ, ఇప్పుడు జంతువులు కూడా సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. పైగా మనుషులకంటే మాకేం తక్కువ అన్నట్లుగా అందమైన హెయిర్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.
తమిళనాడులోని మన్నార్‌గుడి పట్టణంలో రాజగోపాలస్వామి ఆలయంలో సెంగమలం (Sengamalam) అనే ఏనుగు ఉంది. దీనిని ఆలయ అధికారులు 2003లో కేరళ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఇంటర్నెట్ స్టార్‌గా మారిపోయింది. అందుకు కారణం.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్. ఆలయ సిబ్బంది ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్ కోసమే ప్రత్యేకంగా రాజగోపాల్ అనే మావాటిని నియమించారు. అతడు దీన్ని హెయిర్‌ను షాంపుతో ఎండకాలంలో రోజుకు మూడు సార్లు, ఇతర సీజన్లలో రోజుకు ఒకసారి స్నానం చేయించి, తల దువ్వుతారు. ఏనుగు కూడా ఎంతో ఇష్టంగా తల దువ్వించుకోవటం మనం వీడియో చూడొచ్చు. ఇక ఈ ఏనుగు తన డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో ప్రపంచంలోని అత్యంత అందమైన ఏనుగులలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీంతో ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కచ్చితంగా సెంగమలంతో ఫొటో దిగుతారని రాజగోపాల్ చెబుతున్నారు.
కాగా, సెంగమలం ఏనుగు ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వటం ఇదేం తొలిసారి కాదు. 2020లో కూడా ఈ ఏనుడు ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లు షేర్ చేస్తుండటంతో మరోసారి సెంగమలం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు 'హై మెయింటెనెన్స్ క్వీన్', 'నా హెయిర్ కట్ కంటే బాగుంది' అని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






