హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కుక్కకు పూజలు.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో హనుమంతుడి ఆలయంలో ఓ కుక్క విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా కుక్క ఆగకుండా హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంది.

హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కుక్కకు పూజలు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో హనుమంతుడి ఆలయంలో ఓ కుక్క విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా కుక్క ఆగకుండా హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. సోమవారం తెల్లవారుజామున తిరగటం మొదలుపెట్టగా అవిశ్రాంతంగా ప్రదక్షిణలు చేసి ఆలయంలోనే ఓ పక్కన కూర్చుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది భక్తులు ఆలయానికి చేరుకుని కుక్కకు పూజలు చేయడం మొదలుపెట్టారు.

వందల్లో కాకుండా ఏకంగా వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుండటంతో అధికారులు సైతం సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే మొదట రేబిస్ కారణంగా కుక్కలు గుండ్రగా తిరుగుతాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరించగా వైద్యుల బృంధం అక్క‌కు వెళ్లి అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వహించింది. కుక్కకు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు నిర్దార‌ణ కాక‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక భ‌క్తులు కుక్క‌కు పూజ‌లు చేయ‌డంపై కొంద‌రు విమ‌ర్శలు చేస్తుంటే భ‌క్తులు మాత్రం అది హ‌నుమంతుడిపై భ‌క్తితోనే అలా తిరిగింద‌ని చెబుతున్నారు.

Next Story