శవం చుట్టూ మహిళల తీన్మార్ డాన్స్...!

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే కొన్ని భయంకరంగా

శవం చుట్టూ మహిళల తీన్మార్ డాన్స్...!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే కొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. మహిళలు డాన్స్ (Womens Dance) చేసిన అదిరిపోయే మాస్ వీడియో బయటకు వచ్చింది. మహిళలు (Womens) డాన్స్ చేయడం చాలా కామన్. కానీ వీళ్ళు డాన్స్ చేసింది శవం ముందు కావడమే గమనార్హం. ఓ మనిషి చనిపోయి కుటుంబం శోకసంద్రం లో ఉంటే.. అక్కడికి వెళ్లిన కొంత మంది మహిళలు మాత్రం తీన్మార్ డాన్స్ లతో (Dances) రెచ్చిపోయారు.

40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న ఈ మహిళలు.. చీరలు కట్టుకొని.. శవం చుట్టూ అదిరిపోయే డ్యాన్సులు చేశారు. శవం దగ్గర ఏడవాల్సింది పోయి.... తీన్మార్ స్టెప్పులతో (teenmar ) రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదెక్కడి సంప్రదాయం... శవం చుట్టూ డాన్సులు చేస్తారా..? అది కూడా చీరలు కట్టుకొని... డాన్సులు చేస్తున్నారు అని కొంతమంది ఫైర్ అవుతున్నారు. అక్కడ మనిషి చనిపోయాడు... అతన్ని పెళ్ళికొడుకు చేశాడన్న రేంజ్ లో... అలా డాన్స్ చేస్తారేంటి ? అని మరికొంతమంది ఫైర్ అవుతున్నారు. శవం గురించి పక్కకు పెడితే... ఆ ఆంటీలు మాత్రం చాలా బాగా డాన్స్ చేస్తున్నారని... సెటైర్లు పేల్చుతున్నారు.

Instagramme link

Next Story