- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రంలో సొరచేపతో ముద్దులు... చివరికి ఏమైందంటే?
సముద్రంలో ఉండే సొరచేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. వాటిని చూస్తేనే భయపడిపోతారు. సముద్రంలో నివసించే జీవుల్లో సొరచేపలే అత్యంతం క్రూరమైనవి.

దిశ, వెబ్ డెస్క్: సముద్రంలో ఉండే సొరచేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. వాటిని చూస్తేనే భయపడిపోతారు. సముద్రంలో నివసించే జీవుల్లో సొరచేపలే అత్యంతం క్రూరమైనవి. ముఖ్యంగా మనుషులను చూస్తే సొరచేపలు వెంటనే దాడి చేసి చంపేస్తాయి. కాబట్టి అలాంటి సొరచేపలు ఉన్న దగ్గరకు వెళ్లాలంటే వణికిపోతారు. కానీ ఓ యువతి ఏకంగా సముద్రంలో సొరచేపకే ముద్దు పెట్టింది. ఆ సొరచేప సైతం యువతిని ముద్దాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో క్యాప్షన్‌లోని సమాచారం ప్రకారం. సదరు యువతి 2018 నుండి సొరచేపలతో ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. సొరచేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పడానికి తాను ఈ ప్రమోషన్స్ చేస్తోంది. వీడియో ప్రకారం తాను స్నేహం చేసిన సొరచేపకు యువతి డాంట్ అని పేరు కూడా పెట్టుకుంది. అంతే కాకుండా దానితో స్నేహం పెంచుకునేందుకు 30 నెలలు పట్టినట్టు పేర్కొంది.
21నెలలు దానిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ తరవాత అది యువతి చుట్టూ అనుమానంగా తిరగకుండా వద్దకు రావడం ప్రారంభించింది. ఎలాంటి ఆహారం ఇవ్వకుండా మానవులకు సొరచేప ఆప్యాయంగా దగ్గరకు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఎప్పుడు దాని వద్దకు వెళ్లినా సొరచేప ఆప్యాయంగా దగ్గరకు వచ్చి ముద్దాడుతుంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 1,105 రోజుల తరవాత తీసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






