డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో అదరగొట్టిన మహిళ.. వీడియో చూస్తే షాకవుతారు!

by Yella Dhawani Reddy |

రోడ్డుపై ఏదైనా వాహనం నడపాలంటే ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలి.

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో అదరగొట్టిన మహిళ.. వీడియో చూస్తే షాకవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపై ఏదైనా వాహనం నడపాలంటే ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) తప్పనిసరి ఉండాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానాలు, జైలు శిక్షలు వంటి ఇబ్బందుల్లో పడతారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా ఆర్టీఏ అధికారులు నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలో పాస్ అవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. అందులో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కోసం వెళ్లిన మహిళ టెస్టు‌లో పాల్గొన్న విధానం చూస్తే నవ్వకుండా ఉండలేరు.

సాధారణంగా ఆడవాళ్ల డ్రైవింగ్‌పై సోషల్ మీడియా (Social media) విపరీతంగా ట్రోల్స్ (Trolls) వస్తుంటాయి. అమ్మాయిలు వాహనం నడిపితే… ఎదురుగా వస్తున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయని, రైట్ ఇండికేటర్ వేయడం, లెఫ్ట్‌కి తిరగడం, రాంగ్ రూట్‌లో రావడం, సరిగా వాహనాన్ని పార్కింగ్ చేయటం కూడా చేయలేరని ఇలా రకరకాలుగా మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవ్వటం చూస్తుంటాం. ఇక తాజా ఇదే తరహాలో ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన ఓ మహిళ స్కూటీని స్టార్ట్ చేయడానికే పది నిమిషాలు పట్టింది. అనంతరం ఆమె డ్రైవింగ్ చూస్తే ఎవరిని వెళ్లి డ్యాష్ ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంటుంది. పైగా ఆర్టీఏ వారు ఏర్పాటు చేసిన సింబల్స్‌ మరిచిపోయి ఆమె స్వంతంగా కొత్త రోడ్ మ్యాప్ తయారు చేసినట్టుగా అటూ ఇటూ తిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటూ.. 'డ్రైవింగ్ టెస్ట్ కాదు.. స్కూటీకి సర్కస్ ట్రయల్ ఇచ్చినట్టుంది!' అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story