Reckless Parenting: థ్రిల్ రైడ్.. ఇదే చివరి రైడ్! కొడుకు ప్రాణంతో తల్లి ఆటలు!

by Disha Web Desk 14 |
Reckless Parenting: థ్రిల్ రైడ్.. ఇదే చివరి రైడ్!  కొడుకు ప్రాణంతో తల్లి ఆటలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఈ మధ్య రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్లు, బైక్‌లపై ఎక్కించి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా.. మరోవైపు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక- బెంగళూరులో ఓ జంట తమ కుమారుడికి స్కూటీపై థ్రిల్ రైడ్ ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

తమ పిల్లాడిని స్కూటీ ఎడ్జ్‌పై నిలబెట్టి నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పిల్లల థ్రిల్ రైడ్ కోసం కుమారుడి ప్రాణాలతో తల్లి చెలగాటం అడుతున్నది.. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇదే చివరి రైడ్ అయ్యే అవకాశం ఉంటదని ఆ తల్లిదండ్రుల పై నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లలు థ్రిల్ రైడ్ కోరినంత మాత్రానా మరీ అంత పిచ్చి పనులు చేయవద్దని నెటజన్లు సలహాలు ఇస్తున్నారు. ప్రయాణ సమయాల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed