- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్ట్ బ్రేకింగ్ వీడియో.. స్కూటీపై వచ్చి నెలలు నిండని పసి పాపను రోడ్డు మీద వదిలేసిన తల్లి.. జనాలు మొత్తుకున్నా హైస్పీడ్‌తో.. (వీడియో)
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే గుండె బరువెక్కుతుంది. దేవుడు ఎందుకింత అన్యాయం చేస్తాడో అనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. స్కూటీపై ముందు ఆరు నెలల పిల్లను పెట్టుకుని..

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే గుండె బరువెక్కుతుంది. దేవుడు ఎందుకింత అన్యాయం చేస్తాడో అనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. స్కూటీపై ముందు నెలలు నిండని పసిపాపనె పెట్టుకుని.. వెనుక మూడేళ్ల పాపను కూర్చోపెట్టుకుని వచ్చిన ఓ తల్లి.. నడిరోడ్డుపై చిన్నారిని వదిలేసింది. హైస్పీడ్‌తో వెళ్లిపోయింది. ఇక అభం శుభం తెలియని పాప.. రోడ్డు మీదకు దిగగానే సంతోషంతో అంబాడుతూ పోతుంది. దీంతో అక్కడే ఉన్న జనం.. పాపను దగ్గరకు తీసుకున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు జనాలు ఇంత క్రూరంగా కూడా ఉంటారా? అని బాధపడుతున్నారు. ఇంకా నయం పాప మంచి మనుషుల చేతుల్లోకి వెళ్లిందని.. ఈ క్లిపింగ్ చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉందనే నమ్మకం వచ్చిందంటున్నారు. పాపను వదిలేసిన మహిళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఓ బిజినెస్ కూడా అని.. కొందరు పిల్లలను డ్రాప్ చేస్తే వెనుక వచ్చేవాళ్లు పిక్ చేసుకుని అమ్మేస్తారని తిట్టిపోస్తున్నారు.






