ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన లేడీ

by velandi.Saikiran |   (  Updated:2025-07-25 06:31:07  IST  )

బెంగళూరులో ( Benguluru) మరో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ పై ( Auto Driver) ఓ లేడీ రెచ్చిపోయింది.

ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన లేడీ
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో ( Benguluru) మరో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ పై ( Auto Driver) ఓ లేడీ రెచ్చిపోయింది. అతన్ని పచ్చి బూతులు తిట్టడమే... కాకుండా చెప్పులతో కూడా దాడి చేసింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో... రద్దీ ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సాయంత్రం ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువవుతుంది. దింతో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయి.

ఈ నేపథ్యంలోనే.. నగరంలో స్కూటీ పైన వెళ్తున్న ఓ యువతిని... ఆటో ఢీ కొట్టింది. అనుకోకుండా ఆ యువతీ స్కూటీ కి ఆటో... తాకడంతో యువతి కింద పడింది. అయితే.. సడన్ గా జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో... బాధిత యువతి ( Yuvathi) రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్ క్షమాపణలు చెప్పినప్పటికీ... అతన్ని బండ బూతులు తిట్టినట్లు తెలుస్తోంది.

తన చెప్పులు తీసి మరి అతన్ని దారుణంగా కొట్టి రెచ్చిపోయింది. ఇక ఈ వ్యవహారాన్ని ప్రశాంతంగా ఆ డ్రైవర్ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన లో ఎవరిది తప్పిదం అనే విషయంపై విచారణ చేస్తున్నారు. ఇక ఆటో డ్రైవర్ పై దాడి జరిగిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Link

Next Story