ఎయిర్‌పోర్టులో నగ్నంగా మహిళ వీరంగం.. మత్తులో చిందేస్తూ రచ్చ రచ్చ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-03-28 11:56:22  IST  )

డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DFW) టెర్మినల్ Dలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రీసెంట్‌గా జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎయిర్‌పోర్టులో నగ్నంగా మహిళ వీరంగం.. మత్తులో చిందేస్తూ రచ్చ రచ్చ..
X

దిశ, ఫీచర్స్ : డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DFW) టెర్మినల్ Dలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రీసెంట్‌గా జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో ఒంటిపై దుస్తులు లేకుండా తిరుగుతూ సిబ్బందిపై దాడి చేసిన ఆమె.. గేట్ D4 వద్ద మానిటర్ అండ్ బోర్డింగ్ డోర్‌ను ధ్వంసం చేసింది. ‘‘నేను అన్ని భాషలు మాట్లాడతాను’’ అంటూ వింతగా అరుస్తూ.. అసభ్య పదజాలంతో తిట్టిపోసింది. సెక్యూరిటీ మీదకు డ్రింక్స్ విసిరేసింది.

ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. కలికాలం ఈ మధ్య ఈ రకమైన నాటకాలు కామన్ అయిపోయాయి అని కొందరంటే.. ఇంకొందరు ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు దారితీసింది. అయితే కొందరు పీకలదాకా తాగి మత్తులో ఏం చేస్తుందో అర్థం కావడం లేదని, ఏ మొహమాటం లేకుండా చిందేస్తుందని తిట్టిపోస్తున్నారు.

Next Story