- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రోలో ఆ పని చేస్తూ కెమెరాకు చిక్కిన మహిళ.. అధికారులు సీరియస్ (వీడియో)
ఇటీవల మెట్రో రైళ్లలో జంటలు నీచమైన పనులు చేస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్కవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల మెట్రో రైళ్లలో జంటలు నీచమైన పనులు చేస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్కవుతున్నారు. రొమాన్స్ చేస్తూ ఒకరు, ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ ఇంకొందరు, హస్తప్రయోగాలు చేసుకుంటూ మరికొందరు మెట్రోను అడ్డమైన పనులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. వీరందరిపై పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్నా కొత్తవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. అయితే వీటన్నీటికి విరుద్దంగా ఓ మహిళ ఆకలితో కడుపు నింపుకునే ప్రయత్నం చేసి మెట్రో అధికారులు ఆగ్రహానికి గురైంది. బెంగళూరు మెట్రోలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులో ఈ నెల 26న ఓ మహిళ మాదవర స్టేషన్ నుంచి మాగడి రోడ్డుకు వెళ్లేందుకు మెట్రో ఎక్కింది. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకలి వేయడం, మెట్రోలో ప్రయాణికులు తక్కువగా ఉండటంతో తనతో తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను తినాలనుకుంది. వెంటనే క్యారేజీని తన పక్కన సీటుపై పెట్టుకోని భోజనం చేసింది. దీనినంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో బెంగళూరు మెట్రో అధికారులు ఇవాళ యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళను గుర్తించిన సెక్యూరిటీ అధికారులు మాదవర స్టేషన్‌లో ఆమెను నిలిపివేసి రూ.500 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బెంగళూరు మెట్రో నిబంధనలను సదరు మహిళ ఉల్లంఘించిందన్నారు. ‘ఆమె 2025 ఏప్రిల్ 26న మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మెట్రో నిబంధనలను విస్మరించి భోజనం చేసింది. ఈ ఉల్లంఘనను తోటి ప్రయాణికుడు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు’ అని ఒక అధికారి తెలిపారు. బెంగళూరు మెట్రోను పరిశుభ్రంగా ఉంచేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు. మెట్రో ప్రాంగణంలో ఆహారం మరియు పానీయాల వినియోగం అనుమతించబడదని, చెత్త వేయడం నిషేధమని పేర్కొన్నారు. మెట్రో ఒక ఉమ్మడి స్థలమని, ప్రయాణికులందరూ సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం చేయాలనేది మా ఉద్దేశ్యం అన్నారు. పరిశుభ్రతను పాటించేందుకు మెట్రో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ప్రయాణికులు అందరూ మెట్రో నిబంధనలు పాటించి సహకరించాలని అధికారులు కోరారు.






