- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ మేనేజర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ(వీడియో)
* బ్యాంక్ మేనేజర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ * బ్యాంక్‌కు వెళ్లిన టైంలోనే జరిగిన దాడి * సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలు ట్విస్ట్ అదుర్స్..

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్యాంక్ మేనేజర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఓ మహిళ అతనిపై ఎటాక్ చేసింది. లోన్ రివకరీ విషయంలో మాట్లాడుతుండగా.. సదరు వ్యక్తి తన చెంపలు ముట్టుకున్నాడని.. బుగ్గలు తాకాడని ఆరోపించింది. ‘నా బుగ్గలు ఎందుకు పట్టుకున్నావ్ రా? నా భర్త అనుకుంటున్నావా?’ అంటూ చెప్పుతో కొట్టింది. ‘మిగిలిన లోన్ వాయిదాలు కట్టనే కట్టను ఏం చేసుకుంటావో చేసుకో.. లేదంటే నువ్వే కట్టుకో..’ అంటూ తెగేసి చెప్పింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. అనుమతి లేకుండా తాకితే ఎలాంటోడైనా, ఎంత గొప్పోడైనా సరే ఇలాగే గట్టిగా సమాధానమివ్వాలని కామెంట్ చేస్తున్నారు జనాలు. ఇది హరాజ్మెంట్ కిందకు వస్తుందని..కేసు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం లోన్ కట్టకుండా తప్పించుకునేందుకు ఇలాంటి ఐడియాతో వచ్చిందని.. సూపర్ ఎక్స్‌క్యూజ్ అంటూ విమర్శిస్తున్నారు.






