ఆపరేషన్ సిందూర్ దాడి తర్వాత బహవల్‌పూర్ ఉగ్ర స్థావరం ఎలా మారిందో చూస్తారా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-08 13:16:30  IST  )

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam) ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు.

ఆపరేషన్ సిందూర్ దాడి తర్వాత బహవల్‌పూర్ ఉగ్ర స్థావరం ఎలా మారిందో చూస్తారా?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam) ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation sidoor) చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు పాకిస్థాన్, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇందుకోసం భారత్ 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కేవలం 25 నిమిషాల్లో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలు తునాతునకలయ్యాయి.

ఈ దాడుల్లో భారత్.. మురీద్కేలోని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద కేంద్రం, బహవల్‌పూర్‌లోని జైషే మహమ్మద్‌కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం, తెమ్రా కలాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, సియాల్‌కోట్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ మొహమూనా జోయా కేంద్రం, బర్నాలాలో లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం, కోట్లీలోని జైషే మహమ్మద్‌కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలోని హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం, ముజఫరాబాద్ సవాయ్ నాలాలో లష్కరే శిబిరం, ముజఫరాబాద్‌లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక ఈ దాడుల తర్వాత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ బహవల్‌పూర్ (Bahawalpur) నగరంలో ఉన్న జైషే మహమ్మద్‌కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం శిథిలావస్థకు చేరింది. ఇందుకు సంబంధించి వీడియోను ANI ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.

https://x.com/ANI/status/1920303651265888759

Next Story