- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన భర్తను ఏఐ క్లోనింగ్‌తో బతికించుకున్న భార్య.. చివరికి ఊహించని ట్విస్ట్
ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. ఈ యుగంలో సాధ్యం కానివి చాలా ఏతో క్షణాల్లోనే చేస్తున్నారు. ప్రస్తుతం చనిపోయినవారి ఫోటోలను ఏఐకి ఇస్తే వెంటనే ఎడిటింగ్ చేసి వారు బతికి ఉన్నట్టు వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో ఇస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. ఈ యుగంలో సాధ్యం కానివి చాలా ఏతో క్షణాల్లోనే చేస్తున్నారు. ప్రస్తుతం చనిపోయినవారి ఫోటోలను ఏఐకి ఇస్తే వెంటనే ఎడిటింగ్ చేసి వారు బతికి ఉన్నట్టు వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా యూఎస్‌లో అచ్చం చనిపోయిన వ్యక్తి లాంటి మెమోరీతో, అలాంటి ఆకరంతోనే ఓ ఏఐ రోబోను తయారు చేశారు. కెప్టెన్ అనే మహిళ తన భర్త చనిపోవడంతో అతడికి సంబంధించిన ఫోటోలు, అతడి లాప్ టాప్ డేటాను ఓ ఏఐ కంపెనీకి ఇచ్చింది.
ఆ ఏఐ కంపెనీ అచ్చం కెప్టెన్ భర్త అయిన స్టీఫెన్ మాదిరిగా కనిపించే రోబోను తయారు చేసి మహిళకు అందించింది. రోబో భర్తను చూసుకుని ఎంతో మురిసిపోయిన కెప్టెన్ అతడిని అనేక ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలోనే నాతో కాకుండా మీకు మరెవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించగా తనకు ఆఫీసులో ఉన్న అక్రమసంబంధాలు అన్నీ చిట్టి రోబో బయటపెట్టేసింది. దీంతో భార్య కెప్టెన్ తన భర్త చనిపోయినప్పుడు పడిన బాధ కంటే అతడి గురించి తెలిసిన తరవాతే ఎక్కువగా బాధపడింది. ఆ రోబో భర్తతో మాట్లాడటం కూడా మానేసింది. కానీ వారి కుమారుడు మాత్రం తండ్రిని రోబోలో చూసుకుంటూ సంతోషపడుతున్నాడు.






