- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wife Cheating: ప్రియుడితో కారులో అడ్డంగా దొరికిన భార్య! భర్త చేసిన పనికి నెటిజన్లు షాక్.. వైరల్
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడితో కలిసి భర్తను చంపిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Wife Cheating Viral video) తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడితో కలిసి భర్తను చంపిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ప్రియుడికే ఇచ్చి వివాహం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కారులో ప్రియుడితో భార్య.. తన భర్తకు అడ్డంగా దొరికింది. దీంతో భర్త చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ మహిళ తన ప్రియుడితో కారులో వెళ్తుండగా ఆమె భర్త పట్టుకుంటారు. తన భార్యను ఒక్క మాట కూడా ఆ వ్యక్తి స్వయంగా తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని నీళ్లతో కడిగి తొలగిస్తాడు. అనంతరం ఆమె ప్రియుడి చేత మళ్లీ తన భార్య నుదుటిపై సింధూరాన్ని దిద్దించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిపై సింధూరం పెడితే పెళ్లి అయినట్లుగా భావిస్తారు. ఇక, ఆ మహిళ ప్రియుడితో పెళ్లికి ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఈ ఘటన నార్త్ ఇండియాలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన (Viral video) వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు షాకింగ్‌కు గురవుతారు. భర్త చేసిన పనికి చాలా మంది నెటిజన్లు సమర్ధిస్తారు. ‘ప్రియుడు ఆమె కలిసి ప్లాన్ చేసి మొగుడిని చంపే కంటే ముందే మేల్కొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. చాలా మంచి పని చేశావ్ అయ్యా’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలించింది. పెళ్లి చేసి ఆమె భర్త మంచి పని చేసి దరిద్రాన్ని వదిలించుకున్నాడని మరో నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా నిలిచింది. ఆమెతో డైవర్స్ తీసుకుని శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకో అంటూ భర్తకు నెటిజన్లు సూచిస్తున్నారు.






