ఒకప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం, కార్లు, బంగ్లాలు.. భార్య పుణ్యమా అని ఇప్పుడు అడుక్కుంటున్నాడు.. (వీడియో)

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఓ భార్య బాధితుడి వీడియో వైరల్ అవుతోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి.. ఒకప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించేవాడినని చెప్పుకొచ్చాడు. బంగ్లాలు, ఖరీదైన కార్లలో తిరిగేవాడినని.. కానీ

ఒకప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం, కార్లు, బంగ్లాలు.. భార్య పుణ్యమా అని ఇప్పుడు అడుక్కుంటున్నాడు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ భార్య బాధితుడి వీడియో వైరల్ అవుతోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి.. ఒకప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించేవాడినని చెప్పుకొచ్చాడు. బంగ్లాలు, ఖరీదైన కార్లలో తిరిగేవాడినని.. కానీ ఇప్పుడు ఇలా రోడ్డుపై బిచ్చమెత్తుకుంటున్నానని బాధపడ్డాడు. తినడానికి తిండి లేదు.. బట్టలు లేవు.. అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. నా బిడ్డ డాక్టర్ అని.. కానీ భార్య ఇల్లీగల్ ఎఫైర్‌తో తన పరిస్థితి ఇలా అయిందని కన్నీరు పెట్టుకున్నాడు. తన నుంచి పూర్తిగా లాగేసుకుని.. పిచ్చి వాడిని చేసి రోడ్ల మీద పడేలా చేసిందని ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆయన పరిస్థితికి బాధ పడుతున్నారు నెటిజన్లు. చాలా మంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని చర్చిస్తున్నారు.

VIDEO

Next Story