- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఒంటరి పెంగ్విన్.. అసలేంటీ ఈ స్టోరీ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెంగ్విన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఎక్కడ చూసినా పెంగ్విన్ స్టోరీనే వైరల్ అవుతోంది. దీంతో అసలేంటీ కథ.. ఎందుకు ఇంతలా వైరల్ అవుతోందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెంగ్విన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఎక్కడ చూసినా పెంగ్విన్ స్టోరీనే వైరల్ అవుతోంది. దీంతో అసలేంటీ కథ.. ఎందుకు ఇంతలా వైరల్ అవుతోందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి పెంగ్విన్ స్టోరీ ఓ బ్రేకప్ కథ. అందుకే ఎక్కువమందికి కనెక్ట్ అవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో 2007లో ప్రముఖ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన ఎన్ కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఉంది. వీడియోలో మిగితా పెంగ్విన్లు అన్నీ ఓ వైపుకు వెళితే ఓ పెంగ్విన్ మాత్రం 70కిలో మీటర్ల దూరంలో ఉన్న మధ్యభాగం వైపు వెళుతుంది. అది తప్పిపోయిందేమో అని తిరిగి వాటి గుంపులోకి తీసుకువచ్చినా మళ్లీ అక్కడికే వెళ్లిపోతుంది.
దీంతో ఆ పెంగ్విన్ ఏదో విషయంలో మోసపోయిందని, జీవితంలో విసిగిపోయి ఒంటరి దారిని ఎంచుకుందని చెప్పారు. అయితే అదే ఒంటరి పెంగ్విన్ కథను డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం తన పూరి మ్యూజింగ్స్ లో చెప్పారు. పెంగ్విన్ లు చాలా నమ్మకంగా ఉంటాయని అన్నారు. మగ పెంగ్విన్ అందమై పెబల్స్ ఇచ్చి ఆడ పెంగ్విన్ కు ప్రపోజ్ చేస్తుందని అన్నారు. జీవితాంతం అవి రెండూ కలిసి ఉంటాయని అన్నారు. మగ పెంగ్విన్ లు అస్సలు చీట్ చేయవని ఒకవేళ ఆడ పెంగ్విన్ చీట్ చేస్తే మగ పెంగ్విన్ తట్టుకోలేదన్నారు. అలా మోసపోయిన మగ పెంగ్విన్ అందరినీ విడిచిపెట్టి 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి ఆహారం తీసుకోకుండా కుమిలిపోయి చివరికి చనిపోతుందన్నారు. ఈ స్టోరీ చాలా మంది నెటిజన్లకు కనెక్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వైరల్ అవుతోంది.






