- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News:ఫ్యాన్ ఎవరు ఆపేశారు బ్రో.. ఇంట్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా ఏం చేసిందో చూడండి!?(వీడియో)
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. నిత్యం వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సాధారణంగా వేసవి కాలంలో ముఖ్యంగా గ్రామాల్లో పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయనే విషయం తెలిసిందే. చల్లదనం మరియు ఆహారం కోసం, పాములు తమ ఆవాసాలను వదిలి ఇతర ప్రదేశాలకు చేరుకుంటాయి. కానీ.. ఈ పాము ఏకంగా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఇంట్లో ఉంచిన ఫ్యాన్‌ను చుట్టుకుని దానిపై పాకడం కనిపించింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఇంట్లో ఉన్న స్టాండ్ ఫ్యాన్ చుట్టూ ఒక కింగ్ కోబ్రా చుట్టుకుని ఉంది. ఆ వీడియోలో ఉన్న నల్ల తాచు పామును గమనిస్తే.. ఈ మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఫ్యాన్ స్విచ్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఫ్యాన్ బ్లేడ్‌ల చుట్టూ పాము చుట్టుకుని అటు ఇటు పడగ విప్పి చూస్తుంది. దానిని చూస్తే ఎవరైనా అది ఫ్యాన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తుందనే చెబుతారు.
ఇక, కింగ్ కోబ్రా చేసిన పనిని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను @kashikyatra అనే ఖాతా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు..‘అది వేడికి విసుగు చెంది ఫ్యాన్ ఆన్ చేసుకుంటుంది’ ఈ పాముకు 'కూల్ డ్యూడ్' అనే బిరుదు ఇవ్వాలని, ‘నాగరాజ్‌కు వేడిగా ఉంది, ఫ్యాన్ ఎవరు ఆపేశారు బ్రో’ అని కామెంట్లు పెడుతున్నారు.






