- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేక్కడి మాస్ క్రియేటివిటీ రా నాయనా! ఇంతకీ దీని పేరేం పేట్టారో!
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అరచేతిలో ప్రపంచం ఉందనటంలో అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో (Social media) అరచేతిలో ప్రపంచం ఉందనటంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న వింత, విచిత్రం జరిగిన క్షణాల్లో నెట్టింట వైరల్‌గా (Viral) మారిపోతుంది. ఇలా నిత్యం అనేక వీడియోలు మనకు ప్రత్యేక్షమవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా (Funny), మరికొన్ని విచిత్రంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, కొంతమంది తమ విచిత్ర ఆవిష్కరణలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వీడియోలు ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వీడియోలో చైనాకు చెందిన ఓ వ్యక్తి ఓ విచిత్ర వాహనాన్ని ఆవిష్కరించాడు. ఓ ఖాళీ డ్రమ్ముకు ఐరన్ రాడ్లతో నాలుగు పాదాలు అమర్చాడు. ఈ పాదాలకు చివరన చక్రాలు పెట్టాడు. ఇక డ్రమ్ముకు ముందు భాగంలో చిన్న డబ్బాను ఏర్పాటు చేసి చూసేందుకు గాడిద ఆకారంలోకి మార్చేశాడు. ఇక అనంతరం ఆ వింత వాహనంపైకి ఎక్కి సఫారీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఇదేక్కడి మాస్ క్రియేటివిటీ రా నాయనా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






