- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారెవ్వా ఇదెక్కడి చిత్రం.. కరెంట్ స్తంభం ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హరిద్వార్ (Haridwar) జిల్లా జబ్రేరా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా రోజుకు 5 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హరిద్వార్ (Haridwar) జిల్లా జబ్రేరా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా రోజుకు 5 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పవర్ కట్ కారణంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఇంటి పనులకు ఆటంకం కలుగుతోంది. ఇక పశువులకు నీరు పెట్టడం ఆలస్యం అవుతోంది, స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలు ఏకరువు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. శీతాకాలంలో విద్యుత్ కొరత కారణంగా ఇలాంటి షెడ్యూల్ కట్‌లు ఉంటున్నాయని విద్యుత్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జాతి (MLA Virendra Jati) చేసిన పనికి ప్రజలు శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, కరెంట్ కోతలపై జబ్రేరా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వీరేంద్ర జాతి దగ్గరకు వెళ్లి తమ గోడును చెప్పుకున్నారు. తమ సమస్యలు చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని, లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది విని చిరాకు పడిన ఎమ్మెల్యే వీరేంద్ర ఏకంగా విద్యుత్ అధికారులు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్ వివేక్ రాజ్‌పుత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ పాండే, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్ ఇంజినీర్ అనుపమ్ సింగ్ ఇళ్లకు కరెంట్ సరఫరా అయ్యే స్తంభాలు ఎక్కి కటింగ్ ప్లేయర్‌తో కనెక్షన్‌ను కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేంద్ర జాతి మాట్లాడుతూ.. ప్రజలు ప్రతిరోజూ చీకటిలో బాధపడుతుంటే, బాధ్యతాయుత అధికారులు కూడా అదే శిక్షను అనుభవించాలని అన్నారు. అప్పుడే వాళ్లకు ఆ కష్టం ఏమిటో అర్థమవుతుందని కామెంట్ చేశారు. ఇక మీదట అర్థం లేని కరెంట్ కోతలు రిపీట్ అయితే మరికొంతమంది విద్యుత్ అధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేస్తానని ఎమ్మెల్యే వీరేంద్ర జాతి వార్నింగ్ ఇచ్చారు.






