Viral video: ఏంటీ.. ఆ సీన్లన్నీ టామ్ అండ్ జెర్రీ షో నుంచి కాపీ కొట్టారా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-01 11:08:58  IST  )

తెలుగు సినిమా డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్.. తదితరులపై ఎప్పటి నుంచో ఓ విమర్శ ఉంది.

Viral video: ఏంటీ.. ఆ సీన్లన్నీ టామ్ అండ్ జెర్రీ షో నుంచి కాపీ కొట్టారా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా డైరెక్టర్లు (Directors) రాజమౌళి, సుకుమార్.. తదితరులపై ఎప్పటి నుంచో ఓ విమర్శ ఉంది. వీరి హిట్ మూవీలలోని ఫేమస్ సీన్లు దాదాపు హాలివుడ్ (Hollywood), కొరియన్ (Korean) సినిమాల్లో నుంచి కాపీ కొడుతారని అంటుంటారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవ్వటం చూశాం. అయితే, తాజాగా మరోసారి ఈ దర్శకులు దొరిపోయారు. అయితే, ఈ కాపీ కొట్టిన సీన్లు ఎందులోవో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీమ్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సినిమాలైన 'బహుబలి (Bahubali)', 'పుష్ప (Pushpa)', 'RRR' బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా తెరకెక్కిన బహుబలి సిరీస్‌.. తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయనటంలో అతిశయోక్తి లేదు. జక్కన్న క్రియేట్ చేసిన విజువల్ వండర్ మ్యాజిక్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అలాగే, RRR సినిమాకు సైతం ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మీక హీరో హీరోయిన్లుగా నటించిన 'పుష్ప' సినిమాకు కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. అయితే ఇప్పుడు ఇవేందుకంటే.. ఈ సినిమాల్లోని పలు సీన్లను దర్శకులు సేం టూ సేం కాపీ కొట్టినట్లు తెలుస్తోంది.

ఇక చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు ఎంతో ఇష్టపడే కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ. ఇందులో జెర్రీ టామ్‌ని రకరకాలుగా విసిగించటం, రెండు కలిసి ఎంజాయ్ చేయటం, జెర్రీని పట్టుకునేందుకు టామ్ పడే కష్టాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే, టామ్ అండ్ జెర్రీ మధ్య జరిగిన సీన్లను డైరెక్టర్లు ఈ సినిమాల్లో మక్కీకి మక్కీ దించేశారు. బహుబలి సినిమాలో 'ప్రభాస్ చేతులపై నుంచి అనుష్క నడిచి వచ్చి పడువ ఎక్కే' సీన్, పుష్క సినిమాలో ఎంతో ఫేమస్ అయిన 'తగ్గేదెలే మ్యానరీజం స్టైల్, శ్రీవల్లి, ఫిల్లింగ్స్ పాటలలోని స్టెప్పులు', RRR సినిమాలో 'NTR టైగర్స్' సీన్.. టామ్ అండ్ జెర్రీ షో నుంచే కాపీ కొట్టి ప్రేక్షకులను చీట్ చేశారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. 'పోయాం మోసం' అంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, కాపీ క్యాట్స్, 100 శాతం మోసం అంటూ నెటిజన్లు ఈ మీమ్స్‌కి కామెంట్లు కూడా పెడుతున్నారు.

Next Story