- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్లిన సెక్స్ వర్కర్.. చివరికి ఏమైందంటే..?
ఒక సెక్స్ వర్కర్ కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదలిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్ : ఒక సెక్స్ వర్కర్ కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదలిస్తోంది. ఆమె 15ఏళ్ల పాటు ఇంటికి దూరమైంది. సొంత మామనే ఆమెను అమ్మేశాడు. ఓ కంటెంట్ క్రియేటర్ ద్వారా ఇంటికి వెళ్లే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమెను సొంత కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.
అనీష్ భగత్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ వీడియోతో ఆమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో రాక్సీ తన చిన్నతనం గురించి చెప్పింది. తన సొంత మామ తనని 18ఏళ్ల వయస్సులో "సెక్స్ ట్రేడ్'లో అమ్మేశాడని వాపోయింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడినట్టు తెలిపింది. అయితే 15ఏళ్ల తర్వాత రాక్సీ తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. ఇప్పటికే 6.7 మిలియన్ కి పైగా చేరుకుంది.
అయితే రాక్సీ తోటి సెక్స్ వర్కర్లు ఆమె వద్దకు వెళ్లి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చారు. తమలో ఒకరు ఇంటికి తిరిగి వెళుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లే ముందు రాక్సీ ఒక షాప్ లో దిగి.. తన తల్లి కోసం చీర కూడా తీసుకుంది. తన సోదరుడికి వాచ్ కూడా కొంది. భగత్ తో కలిసి రాక్సీ తన గ్రామానికి వెళ్లింది. ఇంటికి వెళ్లేనరికి భావోద్వేగానికి లోనైంది. 15ఏళ్ల తర్వాత తన వాళ్లను చూస్తున్నానని సంతోషించింది. కానీ అంతలోనే రాక్సీ ఊహించని ఘటన ఆ మహిళకు ఎదురైంది. మహిళను ఆమె ఇంటి సభ్యులు లోపలికి రానివ్వలేదు. ఆమె ముందే తలుపు వేసేశారు. ఇతరులు ఏం అనుకుంటారో అన్న భయంతో మహిళను ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదని భగత్ పోస్ట్ చేసిన వీడియె క్యాప్షన్ లో రాసి ఉంది.






