- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: ఏంటి.. హెయిర్ కట్ ట్రైనింగ్ ఇలా ఇస్తారా? ఒలింపిక్ రేంజ్‌లో ఉందిగా!
టెక్నాలజీ అభివృద్ది చెందడంతో ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) అందరికీ అందుబాటులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ అభివృద్ది చెందడంతో ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అలాగే, నిత్యం అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం చూస్తుంటాం. ఇందులో ఫన్నీ వీడియోలు, విచిత్రమైన సంఘటనలు, వివిధ రకాల ఆసక్తికరమైన అంశాలకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. అంతేకాదు, చాలా మంది తమలోని టాలెంట్‌ను కూడా సోషల్ మీడియా వేదికగా నిరూపించుకుంటున్నారు. తెలియని విషయాలను తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతున్న వీడియో కూడా మీకు మరో కొత్త విషయాన్ని తెలియజేయనుంది. ఇది చూశాక కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే?
సాధారణంగా హెయిర్ కట్ ట్రైనింగ్ (Haircut Training) అంటే.. నార్మల్ బార్బర్ దగ్గరైనా, ప్రోఫిషనల్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరైనా ముందుగా నైపుణ్యాలు, టెక్నిక్‌లు నేర్పిస్తారు. అనంతరం మ్యానికిన్ హెడ్ లేదా డమీ హెడ్‌లపై ప్రాక్టీస్ చేయిస్తారు. పర్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత రియల్ కస్టమర్లపై బేసిక్ హెయిర్ కట్లు చేయిస్తారు. ఇవన్నీ ట్రైనింగ్‌లో అనుసరించే విధానాలని మనకు తెలుసు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం వేరే లెవల్ హెయిర్ కట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ తీసుకునే యువకులు ఒక వరుసలో నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో హెయిర్ కట్‌కి ఉపయోగించే.. కత్తెర, దువ్వెన, ట్రిమ్మర్ వంటి పరికరాలు ఉన్నాయి. ఇక వారు వాటితో ఎంతో శ్రద్ధగా కటింగ్‌లోని నైపుణ్యాలను అనుసరిస్తూ కటింగ్ ప్రాక్టిస్ చేస్తున్నారు. అయితే, ట్విస్ట్ ఏంటంటే.. అసలు వారి ముందు ఎలాంటి హెడ్ లేదు. వారు తమ టెక్నిక్‌లను గాల్లోనే ప్రాక్టిస్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒలింపిక్ లెవల్ ట్రైనింగ్ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.






