Viral Video : తలలేని మహిళకు పురుడు పోసిన వైద్యులు..

by Sujitha Rachapalli |

ఇజ్రాయెల్ - పాలస్తీనా ఘర్షణ ఫలితంగా గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. 2023తో హమాస్ నిర్వహించిన దాడులతో.. ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఆ దేశ సైనిక చర్యల కారణంగా గాజాలో మానవతా సంక్షోభం దిగజారింది. బాంబు దాడులు కారణంగా ప్రాణ నష్టం భారీగానే ఉంది.

Viral Video : తలలేని మహిళకు పురుడు పోసిన వైద్యులు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ - పాలస్తీనా ఘర్షణ ఫలితంగా గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. 2023తో హమాస్ నిర్వహించిన దాడులతో.. ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఆ దేశ సైనిక చర్యల కారణంగా గాజాలో మానవతా సంక్షోభం దిగజారింది. బాంబు దాడులు కారణంగా ప్రాణ నష్టం భారీగానే ఉంది. ఆహారం, నీరు లేక.. వైద్య సదుపాయాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నిరాశ్రయులైన మహిళల కష్టాలు దారుణం. ఈ క్రమంలో అక్కడ సేవలందిస్తున్న ఆస్ట్రేలియన్ లేడీ డాక్టర్స్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నామంటే ఏ క్షణంలోనైనా మేము చనిపోవచ్చు. ఇక్కడ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది పేషెంట్లు పిల్లలు, గర్భిణులే. ఒక తలలేని తొమ్మిది నెలల గర్భవతికి డెలివరీ చేశామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఈ టెర్రర్, హారర్‌ను ఆపండి’ అని అభ్యర్థించారు.

Next Story