VIRAL: సంక్రాంతికి వెళుతున్నాం మా ఇంటికి రావొద్దు.. దొంగలకు యజమాని విజ్ఞ‌ప్తి

by Ajay Maddhiboyina |

ఓ ఇంటి యజమాని మాత్రం వినూత్నంగా ఆలోచించి దొంగలకు అసలు ఇంట్లో దూరే పని లేకుండా చేశాడు. తన ఇంటి డోర్‌కు .. మేము సంక్రాంతికి ఊరికి వెళుతున్నాము. డబ్బు, నగలు తీసుకుని వెళుతున్నాం.. దయచేసి మా ఇంటికి రాకండి.. ఇట్లు, మీ శ్రేయోభిలాషి అంటూ పేర్కొన్నాడు.

VIRAL: సంక్రాంతికి వెళుతున్నాం మా ఇంటికి రావొద్దు.. దొంగలకు యజమాని విజ్ఞ‌ప్తి
X

దిశ, వెబ్ డెస్క్: పండుగలు వచ్చాయంటే పట్నంలో ఉండే చాలా మంది తమ సొంతూళ్లకు వెళుతుంటారు. సొంతూరులో పండుగను సెలబ్రేట్ చేసుకుని తిరిగి మూడు నాలుగు రోజుల తరవాత ఇంటికి వస్తారు. ఈ క్రమంలో దొరికిందే ఛాన్స్ అనుకుని దొంగలు సైతం రెచ్చిపోతుంటారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊరికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేలోపు ఇళ్లు గుళ్ల చేసేస్తారు. దొరికినంతా దోచేసి అక్కడ నుండి జంప్ అవుతారు. పోలీసులు, మీడియా ఎంత ప్రచారం చేసినా చాలా మంది అది పట్టించుకోకుండా ఇంటియజమానులు లైట్ తీసుకుంటారు.

ఇళ్లంతా దోచుకుని వెళ్లిన తరవాత లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు దొంగలను పట్టుకుంటే ఏమైనా దొరుకుతుంది లేదంటే గోవిందా అనుకోవాల్సిందే. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం వినూత్నంగా ఆలోచించి దొంగలకు అసలు ఇంట్లో దూరే పని లేకుండా చేశాడు. తన ఇంటి డోర్‌కు .. మేము సంక్రాంతికి ఊరికి వెళుతున్నాము. డబ్బు, నగలు తీసుకుని వెళుతున్నాం.. దయచేసి మా ఇంటికి రాకండి.. ఇట్లు, మీ శ్రేయోభిలాషి అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Next Story