US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్యకు ఓటు.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్

by Gantepaka Srikanth |   (  Updated:2024-11-07 12:24:42  IST  )

అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉన్న అభ్యర్థులను కాదని.. ఓ ఓటర్ బాలయ్య(Balayya)కు ఓటేశాడు.

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్యకు ఓటు.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులను కాదని.. ఓ ఓటర్ బాలయ్య(Balayya)కు ఓటేశాడు. బ్యాలెట్ పేపర్‌లోని అదర్స్ ఆప్షన్‌లో బాలయ్య అని రాసి మరీ ఓటేశాడు. అంతేకాదు.. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నందమూరి బాలయ్య ఫ్యాన్స్ కంటపడటంతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. కామెంట్లు, రీట్వీట్లతో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీ(Democratic Party) మహిళా అభ్యర్ధి కమలా హారిస్‌‌(Kamala Harris)పై ఆయన గెలుపొందారు. దీంతో 79 ఏళ్ల వయసులో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించి శుభాకాంక్షలు చెప్పారు.

Next Story