- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: మండపంలో పెళ్లికి ‘బ్రేక్’.. బురద పొలాల్లో వరుడి ‘పికప్’
రాజస్థాన్‌లో పెళ్లి వేడుకలో హైడ్రామా చోటుచేసుకుంది. కట్నంగా మహీంద్రా స్కార్పియో ఇవ్వలేదని పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి బాజాలు మోగుతుండగా ఆనందంతో చిందులేయాల్సిన బంధువులు.. పొలాల వెంట ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. రాజస్థాన్ (Rajasthan)లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కట్నంగా మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) కారు ఇవ్వలేదన్న నెపంతో, వరుడు పెళ్లి పీటల మీద నుంచి పారిపోవడం కలకలం రేపింది.
వరమాలలో ట్విస్ట్..
కాగా, గురువారం జరిగిన ఈ వివాహంలో, దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుండగా.. వరుడు అకస్మాత్తుగా వధువుకు దండ వేసేందుకు నిరాకరించాడు. తనకు తెల్లటి స్కార్పియో కారు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. అప్పటికే పెళ్లి ఖర్చులు, బంగారు ఆభరణాల కోసం తన వద్ద ఉన్నదంతా ఖర్చు చేశానని, కారు కొనడానికి సమయం కావాలని వధువు తండ్రి బతిమాలాడు. అయినా వధువు తండ్రి విన్నపాన్ని తోసిపుచ్చిన వరుడు, తన తలపాగాను పక్కన పడేసి, పెళ్లి వేదికపై నుంచి దూకి పొలాల్లోకి పరుగులు తీశాడు.
బుదర పొలాల్లో హైడ్రామా..
పట్టువస్త్రాలు ధరించిన బంధువులు ఆ వరుడిని పట్టుకోవడానికి బురద పొలాల్లో దాదాపు 40 నిమిషాల పాటు వెంటాడారు. చివరకు ఒక బోరుబావి వద్ద అతడిని పట్టుకున్నారు. అయితే, జరిగిన ఈ అవమానం తర్వాత వధువు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మనుషుల కంటే యంత్రాలకే విలువ ఇచ్చే వ్యక్తి తనకు అక్కర్లేదని చెబుతూ.. ఆ పెళ్లిని నిరాకరిస్తున్నట్లు తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో, వరుడిని కట్నం వేధింపుల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వధువు ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటుండగా, కట్న పిశాచుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






