- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: వామ్మో.. చికెన్ నుంచి పురుగులు ఎలా బయటి వస్తున్నాయో చూడండి!
మనలో చాలా మంది చికెన్‌ను ఇష్టం తింటుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: మనలో చాలా మంది చికెన్‌ను ఇష్టం తింటుంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో భోజనానికి కచ్చితంగా చికెన్ కర్రీ ఉండాల్సిందే. ఉదయాన్నే మార్కెట్ వెళ్లి ఫ్రెష్‌గా చికెన్ తీసుకొచ్చి మంచిగా వండుకుని కడుపు నిండా ఆరగించేస్తుంటారు. మరీ మీరు ఫ్రెష్ అని తెచ్చుకునే చికెన్ నిజంగానే మంచిదేనా. ఎందుకంటే.. ఇటీవల బయట రెస్టారెంట్లలో చికెన్ బిర్యానీలో కప్పలు, పురుగులు, పలు హోటళ్లలో కుళ్లిన ఆహారా పదార్థాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఓ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఇంట్లో మంచి చికెన్ కర్రీ చేసుకుందామని తెచ్చుకున్న చికెన్‌లోంచి తెల్ల పురుగులు బయటికి రావటం చూసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కాకినాడ (Kakinada) జిల్లా సామర్లకోటలో ఓ కుటుంబం చికెన్ షాపు నుంచి చికెన్ తెచ్చుకుంది. వండేందుకు సిద్ధమవుతుండగా అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే చికెన్‌ను షాపుకు తీసుకెళ్లి ప్రశ్నించగా, దుకాణం యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అధికారులు మాంసం షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
చికెన్‌లో పురుగులు కనబడటం చాలా అరుదు. సరైనా పద్ధతిలో నిల్వ చేయకపోతే, లేదంటే చాలా రోజుల నుంచి పచ్చి మాంసాన్ని అలాగే పెడితే పురుగులు పడుతాయి. ఇలాంటి చికెన్‌ను తినకూడదు. ఇలాంటి ఘటనలూ చోటుచేసుకుంటే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే, చికెన్ షాపు నుంచి మాంసం తెచ్చుకునేటప్పుడు వ్యాపారి మీ ముందే కట్ చేసి ఇస్తున్నాడా లేదా స్టోర్ చేసింది ఇస్తున్నాడా అని కచ్చితంగా గమినించాలి.






