- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: షాకింగ్.. విద్యార్థులను ఉరికి వేలాడదీసి ఏం చేస్తున్నారో చూడండి!
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని వింతగానూ షాకింగ్ ఉంటాయి. ఇంకొన్ని కోపాన్ని తెప్పించేవిగా ఉంటాయి. ఇక అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. కామెంట్లలో మండిపడుతున్నారు.
ఈ వీడియోలో ఒక స్టేజ్‌పై ముగ్గురు అబ్బాయిలు ఖైదీల వేషధారణలో ఉన్నారు. వారి తలలు నల్లటి వస్త్రాలతో కప్పి ఒక చెక్కకు ఉరివేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే.. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ స్కూళ్లో జరిగిన వేడుకల్లో ప్రదర్శించిన నాటకంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నాటాకానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు స్కూల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో ఇలాంటి ప్రమాదకర నాటాకాలు వేయించటం అవసరమా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు స్పందించాలని ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఏ ప్రాంతానికి ఏ స్కూలుకు సంబంధించినదో తెలియలేదు. కానీ, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రమాదకర నాటకాలు ప్రదర్శించకూడదని కోరుతున్నారు.
प्रोग्राम के लिए किसी की जिंदगी को यूं खतरे में डालना गलत है।
— अश्विनी सोनी اشونی سونی (@Ramraajya) January 28, 2025
सोशलमीडिया पर वीडियो वायरल है।
कबकी और कहाँ की घटना इसकी जाँच कर इसका संज्ञान लिया जाना आवश्यक है। pic.twitter.com/ylTbrxq04s






