- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: బాయ్ ఫ్రెండ్ కోసం ఈ స్కూల్ విద్యార్థినులు రోడ్డుపై ఏం చేశారో చూడండి!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ప్రభావమా అని యువత సోషల్ మీడియాకు (Social Media) విపరీతంగా బానిసలవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ప్రభావమా అని యువత సోషల్ మీడియాకు (Social Media) విపరీతంగా బానిసలవుతున్నారు. ఈ క్రమంలో పాఠశాల వయస్సులోనే లవర్స్‌ను మెయింటెయిన్ చేయడాన్ని ఒక స్టేటస్‌గా భావిస్తూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్న వీడియో చూస్తే.. విద్యార్థులు ఇంత దిగజారిపోతున్నారా అనిపించకమానదు. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థినులు (Students) తమ బాయ్ ఫ్రెండ్ కోసం రోడ్డుపైనే జుట్టు పట్టుకుని గొడవ పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒకే అబ్బాయిని ఇద్దరు విద్యార్థినులు ఇష్టపడ్డారు. ఈ విషయం వారికి తెలియటంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు. ఇద్దరు విద్యార్థినులు బయటకి తమ తోటి స్నేహితులతో వచ్చారు. అనంతరం వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా కొంతసేపటికి హింసాత్మకంగా మారింది. స్కూలు యూనిఫామ్‌లోనే ఉన్న ఈ ఇద్దరు విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకోవడం, జుట్టును పట్టుకొని లాగడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరు విద్యార్థినులతో పాటు తమ తోటి స్నేహితులు కూడా గొడవకు దిగి విపరీతంగా కొట్టుకోవటం ప్రారంభించారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేసి, పంపించేశారు. ఇదంతా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు విద్యార్థినుల తీరుపై మండిపడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి ప్రవర్తన ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల తీరుపై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఇక ఈ ఘటన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదర్ పోలీస్‌స్టేషన్ అధికారి అజయ్ కుమార్ స్పందించారు. స్కూల్ విద్యార్థినుల మధ్య జరిగిన ఈ ఘర్షణపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే దీనిపై కేసు నమోదు చేయలేదని, సంబంధిత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని హెచ్చరించినట్లు తెలిపారు.
बॉयफ्रेंड के लिए छात्राओं की मारपीट का वीडियो हुआ वायरल !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 3, 2025
पूर्णिया में बॉयफ्रेंड के लिए बीच सड़क आपस में भिड़ गईं दो लड़कियां, दोनों ने एक दूसरे बर जमकर परसाए लात-घूंसे !!#ViralVideo #Trendingvideo #ShockingNews pic.twitter.com/HPmuRlNDVr






