- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: పోలీసులకే చుక్కలు చూపించిన యువకుడు.. వైరల్ వీడియో
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబికానగర్‌లో ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్రలోని థానే జిల్లాలో (Wagle Estate) వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబికానగర్‌లో ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు ఓ యువకుడికి ఫైన్ వేశారు. అదే సమయంలో యువకుడు ట్రాఫిక్ పోలీసులు నడిపిస్తున్న స్కూటీకి నెంబర్ ప్లేట్ సరిగా లేదని గమనించాడు. ఈ విషయంపై వెంటనే వారిని ప్రశ్నించగా, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు ఆగకుండా వారి వెంటపడి మరీ వాహనాన్ని ఆపి, ‘ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా? పోలీసులకు వర్తించవా?’ అంటూ నిలదీశాడు.
దీంతో పోలీసులు ‘ఆ స్కూటీని స్టేషన్‌కు తరలిస్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. కానీ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉండటంతో యువకుడు మరింత గట్టిగా ప్రశ్నించి పోలీసులకు చుక్కలు చూపించారు. ఈ మొత్తం ఘటనను యువకుడు వీడియో తీసీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నెటిజన్‌లు అభినందించారు. నియమాలు అందరికీ సమానంగా ఉండాలి.. పోలీసులే రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా? అని నెటిజన్‌లు నిలదీశారు. వీడియో ఇదే..






