Viral video: ఎవర్రా వీడు.. గేదెకు ఐ బ్రోస్ చేయడమేంటి?

by Yella Dhawani Reddy |

సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

Viral video: ఎవర్రా వీడు.. గేదెకు ఐ బ్రోస్ చేయడమేంటి?
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు బాగానే ఎంటర్‌టైన్ అవుతున్నారు. కొందరు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుండగా.. మరికొందరు నెట్టింట్లో వైరల్ అవ్వడమే లక్ష్యంగా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగైనా ఫేమస్ కావాలని ఎంతకైనా తెగిస్తున్నారు. పబ్లిక్‌లో ఉన్నామా? ప్రైవేట్‌గా ఇంట్లో ఉన్నామా? అనేది కూడా పట్టించుకోకుండా నటించేస్తున్నారు. ఇందులో కొన్ని నవ్వు తెప్పించేవి అయితే, మరికొన్ని కోపం తెప్పించేవి కూడా ఉంటాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఏం చేశాడో తెలుసా? ఈ వ్యక్తి చేసిన పని చూసి నెటిజన్లు పగలబడి మరీ నవ్వుతున్నారు.

సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇంట్లో చిట్కాలు పాటించటంతో పాటు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ముఖ సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి గేదెకు ఐ బ్రోస్ చేశాడు. ఓ గేదెల కొట్టెంలో కొన్ని గేదెలు కట్టేసి ఉన్నాయి. అక్కడే ఓ వ్యక్తి కూర్చుని ఓ గేదెకు దారంతో ఐ బ్రోస్ ట్రిమ్ చేస్తున్నాడు. ఆ గేదె కూడా ఎలాంటి బెదురు లేకుండా అతడికి సహకరిస్తుంది. ఈ వీడియోలో 'న్యూ బ్యూటీ పార్లర్ ట్యాగ్ యువర్ సిస్టర్' అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు 'ఎవర్రా వీడు ఇలా ఉన్నాడు', 'గేదెకు ఐ బ్రోస్ చేయడమేంట్రా' అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story