VIRAL: బక్రీద్‌ బలి నుంచి ‘ట్రంప్’ జస్ట్ మిస్.. ఇకపై ఢాకా జూలో సందడే సందడి!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-28 06:18:28  IST  )

చూడటానికి తెల్లగా భళే ముద్దుగా ఉన్న ‘ట్రంప్’ బక్రీద్ వేళ చావు గండం తప్పించుకుంది.

VIRAL: బక్రీద్‌ బలి నుంచి ‘ట్రంప్’ జస్ట్ మిస్.. ఇకపై ఢాకా జూలో సందడే సందడి!
X

దిశ, వెబ్‌‌డెస్క్: బంగ్లాదేశ్‌లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన ‘ట్రంప్’ (Trump) అనే అరుదైన తెల్ల గేదెకు చావు నుంచి విముక్తి లభించింది. బక్రీద్ పండుగ వేళ బలి ఇవ్వడం కోసం సిద్ధం చేసిన జంతువుల జాబితా నుంచి దీనిని మినహాయించారు. ఈ విచిత్ర జీవిని సంరక్షించేందుకు గాను బంగ్లాదేశ్ రాజధానిలోని ప్రముఖ ఢాకా జూ (Dhaka Zoo)కు తరలించారు.

గేదెకు ‘ట్రంప్’ పేరు ఎందుకంటే..

అయితే, మాములుగా గేదెలు నలుపు, ముదురు రంగులో ఉంటాయి. కానీ, జన్యుపరమైన మార్పుల (Albino) కారణంగా ఈ గేదె పూర్తిగా తెల్లటి శరీర రంగుతో జన్మించింది. మరింత విచిత్రంగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జుట్టు రంగును పోలి ఉండేలా ఈ అల్బినో గేదె తలపై ప్రత్యేకమైన తెల్లటి జుట్టు ఉంది. దాంతో స్థానికులు దీనికి ముద్దుగా ‘ట్రంప్’ అని పేరు పెట్టారు. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండటంతో బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బక్రీద్ పండుగల వేళ సాంప్రదాయం ప్రకారం జంతువులను త్యాగం (Sacrifice) చేయడానికి ఏర్పాట్లుగా జరుగుతున్నాయి. దీంతో ‘ట్రంప్’ను కూడా బలి ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇంతటి అరుదైన, విలక్షణమైన శ్వేత గేదెను చంపేయడం ఇష్టం లేని జంతు ప్రేమికులు, అధికారులు జూకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

Next Story