- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: పొలంలో బయటపడిన నిధి.. ఏకంగా 70 పురాతన నాణేల లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఓ రైతు ట్రాక్టర్లతో పొలాన్ని చదును చేయిస్తుండగా 14వ శతాబ్దపు బహుమనీ సుల్తానుల కాలం నాటి 70 పురాతన నాణేలు ఉన్న నిధి బయటపడింది.

దిశ, వెబ్‌డెస్క్: పొలం చదును చేస్తుండగా అదృష్టం తలుపు తట్టింది. మట్టిలో నుంచి మెరిస్తూ పురాతన నాణేలు ప్రత్యక్షమయ్యాయి. కానీ, ఆ అదృష్టమే చివరకు పోలీసుల వరకు వెళ్లేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బిజీ కొత్తూరు (BG Kotturu) గ్రామంలో ఓ రైతు పొలాన్ని ట్రాక్టర్లతో చదును చేస్తుండగా, భూమిలో నుంచి సుమారు 70 పురాతన నాణేలు బయటపడ్డాయి. వీటిని చూసిన అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు వాటిని తీసుకున్నారు.
అయితే, బయటపడ్డ నాణేల పంపకాల విషయంలో ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ వచ్చాయనే గొడవ చిలికి చిలికి గాలివానలా మారి గుప్త నిధి విషయం గ్రామస్థులకు తెలియడంతో చివరకు పోలీసుల వరకు వెళ్లింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఓ వ్యక్తి దగ్గర ఉన్న రెండు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం, ఈ నాణేలు 14వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఇవి బహుమనీ సుల్తానుల కాలం నాటివని పురావస్తు శాఖాధికారులు భావిస్తున్నారు. మిగిలిన నాణేల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






