Food Lover: వర్షంలో విందు..! భోజన ప్రియుడి వీడియో నెట్టింట్లో వైరల్‌

by Bhanu |   (  Updated:2025-06-03 11:57:03  IST  )

శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో వర్షం ఒకటి. అయితే వర్షం పడుతుంటే చాలామంది భోజనానికి ఇబ్బంది పడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కురుస్తున్న వానను పట్టించుకోకుండా భోజనాన్ని ఆస్వాదించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Food Lover: వర్షంలో విందు..! భోజన ప్రియుడి వీడియో నెట్టింట్లో వైరల్‌
X

దిశ, వెబ్ డెస్క్ : శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో వర్షం ఒకటి. అయితే వర్షం పడుతుంటే చాలామంది భోజనానికి ఇబ్బంది పడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కురుస్తున్న వానను పట్టించుకోకుండా భోజనాన్ని ఆస్వాదించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఘటనతో వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను irfanshaikh అనే ఖాతాలో షేర్ చేయగా, ఇప్పటికే 8 మిలియన్ మందికిపైగా వీక్షించారు. వీడియోలో ఓ పెళ్లి వేడుకలో భోజనాల మంటపంలో టేబుల్‌ చుట్టూ నీరు నిండిపోయింది. సర్వ్ చేస్తున్న టేబుల్‌పైనా, ప్లేట్‌పైనా నీరు కనిపిస్తుంది. అలాంటప్పటికీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం అసౌకర్యం లేకుండా భోజనం చేస్తున్నాడు. రోటీ నీటిలో నానిపోయి ఉబ్బిపోయినా... దానిని సాంబార్‌తో కలిపి బాగా తింటున్నాడు.

కామెంట్లలో కామెడీ - బకాసుర వంశీకుడా? అంటూ.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ఇంత వానలో భోజనం చేయాలనేది ప్రతి యువకుడి కల” అని ఒకరు రాశారు. “ఈయనను చూస్తే... భోజనం ఎన్ని రోజుల నుంచి చేయలేదేమో అనిపిస్తుంది!” అని ఇంకొకరు రాశారు. “ఇంత కష్టంలో కూడా విందు వదలకుండా తింటాడంటే... దేవుడే!" అంటూ ఆశ్చర్యపోతున్నారు.

వర్షంలో తడుస్తున్నా... ప్లేట్‌లో నీరు నిండినా... భోజనాన్ని అసలు మానేయకుండా అచ్చం సినిమా సీన్లు గుర్తుకెత్తేలా తింటున్న ఈ వ్యక్తి వీడియో, ఫుడ్ లవర్స్‌కు నవ్వుల విందుగా మారింది. అంతే కాదు... "బకాసుర వంశీకుడా..?" అని పేరుపెట్టేసేంతగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు.




Next Story