Viral: రూ.లక్ష పెట్టి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ ఆర్డర్‌.. ఏం వచ్చిందో తెలిస్తే షాకే!

by Kema Shiva Kumar |

ఈ రోజుల్లో అంతా ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు.

Viral: రూ.లక్ష పెట్టి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ ఆర్డర్‌.. ఏం వచ్చిందో తెలిస్తే షాకే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో అంతా ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ఏదైనా ఒక ఐటమ్ నచ్చితే రివ్యూలు, రేటు చూసి డిజిటల్ పేమెంట్స్‌తో డైరెక్ట్‌గా వినియోగదారులకు ఆ ఐటమ్ ఇంటికే వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రేమానంద్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్‌లైన్‌లో అక్టోబర్ 14న సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్‌ను ఆర్డర్ పెట్టాడు. సరిగ్గా ఐదు రోజుల తర్వాత అక్టోబర్ 19న తన ఇంటికి కొత్త ఫోన్ పార్సెల్ వచ్చింది. అయితే, అతడు తన స్నేహితులను సర్‌ప్రైజ్ చేసేందుకు ముందుగా తన ఫోన్‌లో అన్‌బాక్సింగ్ వీడియో చేస్తుండగా ఒక్కసారిగా షాక్‌ గురయ్యాడు. కానీ, ఆ పార్సెల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్‌‌కు బదులుగా ఓ పెద్ద టైల్ ముక్కను చూసి అవాక్కయ్యాడు. దీంతో ప్రేమానంద్ అదే రోజు నేషనల్ సైబర్‌ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్-66 (D), BNS యాక్ట్‌లోని సెక్షన్ 318 (4), 319 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story