- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఆకాశంలో ‘అశ్లీల’ ఆకృతులు.. ఫిన్లాండ్ ట్రైనీ పైలట్ల వింత చేష్టలు
ఫిన్లాండ్‌లో ట్రైనీ పైలట్లు ఆకాశంలో అశ్లీల ఆకృతులు గీసి వివాదంలో చిక్కుకున్నారు. రాడార్ మ్యాప్‌లో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో వైమానిక దళం విచారణకు ఆదేశించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైమానిక దళంలో చేరిన ట్రైనీ పైలట్లు నిబద్ధతతో ప్రాక్టీస్ చేస్తూ.. సీనియర్లు ఇచ్చిన టిప్స్‌ను ఫాలో అవుతూ వృత్తిలో పట్టు సాధించేందకు అహర్నిషలు కృషి చేస్తుంటారు. కానీ, ఫిన్లాండ్ (Finland)లో ట్రైనీ పైలట్లు చేసిన ఒక పని ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. శిక్షణలో భాగంగా విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లు ఆకాశంలో అశ్లీల ఆకృతులు అంటే పురుషాంగం ఆకృతి వచ్చేలా విమానాన్ని తిప్పారు. రాడార్ మ్యాప్‌లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో సదరు పైలట్లు ప్రస్తుతం క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్నారు.
రాడార్‌కు చిక్కిన ‘కళాఖండం’..
ఫిన్లాండ్ వైమానిక దళానికి చెందిన ఈ ట్రైనీ పైలట్లు తమ విమాన మార్గాన్ని (Flight Path) ఉపయోగించి ఆకాశంలో ఈ వివాదాస్పద ఆకృతిని గీశారు. సాధారణంగా విమానాల కదలికలను గమనించే ‘ఫ్లైట్ రేడార్ 24’ (FlightRadar24) వంటి వెబ్‌సైట్లలో విమానం ప్రయాణించిన మార్గం ఒక గీతలా కనిపిస్తుంది. వీరు కావాలనే విమానాన్ని మలుపులు తిప్పుతూ ఆ అశ్లీల చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను ఫిన్లాండ్ వైమానిక దళం తీవ్రంగా పరిగణించింది. పైలట్ల ప్రవర్తన అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని, ఇది వైమానిక దళ క్రమశిక్షణకు విరుద్ధమని అధికారులు మండిపడుతున్నారు. సదరు ట్రైనీ పైలట్లపై విచారణకు ఆదేశించామని, వారిని శిక్షణ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే, గతంలో కూడా అమెరికా, బ్రిటన్ యువ పైలట్లు ఇలాంటి చేష్టలు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఫిన్లాండ్‌లో కూడా అదే రిపీట్ అవ్వడంతో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.






