180 మంది బాలికలపై అఘాయిత్యం.. వీధుల్లో నిందితుడిని ఊరేగించిన పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 03:55:59  IST  )

సోషల్ మీడియా ద్వారా 180 మంది బాలికలను ట్రాప్ చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించిన పూణే సెక్స్ రాకెట్ నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

180 మంది బాలికలపై అఘాయిత్యం.. వీధుల్లో నిందితుడిని ఊరేగించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో సంచలనం సృష్టించిన పూణే సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 180 మంది బాలికలను సోషల్ మీడియా వేదికగా ట్రాప్ చేసి, వారి జీవితాలతో ఆడుకున్న కామాంధుడు అయాన్ అహ్మద్ తన్వీర్ (19)ను పోలీసులు పరాట్వాడ (Paratwada) నగర వీధుల్లో బహిరంగంగా ఊరేగించారు. నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్ సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో వారిని లోబరుచుకునేవాడు. వారిని నమ్మించి ఏకాంతంగా కలిసిన సమయంలో 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వీడియోలతో బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

పోలీసుల యాక్షన్..

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో, నిందితుడి చేతులకు సంకెళ్లు వేసి నగర వీధుల్లో నడిపిస్తూ ఊరేగించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసుల చర్యను సమర్థించారు. ప్రస్తుతం నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

VIRAL: ఆకాశంలో ‘అశ్లీల’ ఆకృతులు.. ఫిన్లాండ్ ట్రైనీ పైలట్ల వింత చేష్టలు

Next Story