- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: మాతృత్వానికి మరణం.. ప్రేమకు భాష లేదు! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
అమ్మ ప్రేమ.. అది మనిషికైనా, మూగజీవానికైనా ఒకటే అని నిరూపించే హృదయవిదారక దృశ్యం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: అమ్మ ప్రేమ.. అది మనిషికైనా, మూగజీవానికైనా ఒకటే అని నిరూపించే హృదయవిదారక దృశ్యం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తన కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన బిడ్డను దూరం చేయవద్దంటూ ఒక తల్లి ఆవు చేసిన ఆక్రందన స్థానికులను కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నాగేపూర్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఓ ఆవు దూడ మృతి చెందింది. గ్రామస్థులు ఆ దూడ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్తుండగా, ఆ తల్లి ఆవు తట్టుకోలేకపోయింది. ట్రాక్టర్‌లో ఉన్న తన బిడ్డను చూస్తూ ఆ ఆవు కన్నీరుమున్నీరుగా విలపించింది. ట్రాక్టర్ కదులుతుంటే.. తన బిడ్డను ఎక్కడ తీసుకెళ్లిపోతారో అన్న ఆందోళనతో ఆ వాహనం వెనకాలే కిలో మీటర్ల మేర పరుగెత్తింది. అంబా అంటూ అది పెట్టిన కేకలు, ఆ తల్లి ఆవేదన చూసి దారి వెంట వెళ్లే వారు సైతం ఆగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజెన్లు ‘భాష లేకపోయినా భావం ఒకటే.. మాతృత్వానికి మరణం లేదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.






