VIRAL: 70 ఏళ్ల వయసులో అత్తకు ఫస్ట్ కుర్తా.. గోవా కోడలి వినూత్న ప్రయత్నం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-21 11:55:18  IST  )

గోవాకు చెందిన ఓ కోడలు ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకునే తన 70 ఏళ్ల అత్తగారిని మొదటిసారి కుర్తా కొనేందుకు షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లింది.

VIRAL: 70 ఏళ్ల వయసులో అత్తకు ఫస్ట్ కుర్తా.. గోవా కోడలి వినూత్న ప్రయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్టింట్లో వచ్చే కొన్ని వీడియోలు కొందరితో కన్నీళ్లు పెట్టిస్తాయి.. మరికొన్ని గుండెకు హత్తుకునేలా ఉంటాయి. ప్రస్తుతం అచ్చం అలాంటి వీడియోనే నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. లైఫ్‌లో ఇప్పటి వరకు చీరలు మాత్రమే కట్టే తన 70 ఏళ్ల అత్తగారిని, ఫస్ట్ టైమ్ కుర్తా కొనేందుకు షాపింగ్‌కు తీసుకెళ్లిన ఓ కోడలు. గోవాకు చెందిన స్వాతి కార్ డీసిల్వా అనే మహిళ తన అత్తగారి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే, అత్తకు మరింత సౌకర్యవంతంగా ఉండే దుస్తులను అలవాటు చేయాలని స్వాతి ఆలోచన. ఆమెను ఎలాగోలా ఒప్పించి ఒక షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లింది. తన 70 ఏళ్ల జీవితంలో ఎన్నడూ లేనివిధంగా ఆ వృద్ధురాలు మొదటిసారి వెస్ట్రన్ (Western), కాజువల్ స్టైల్ (Casual Style) కుర్తాలను ఆసక్తిగా చూసింది.

కోడలి ప్రేమకు నెటిజన్లు ఫిదా..

షాపింగ్ మాల్‌లోని ట్రయల్ రూమ్‌ (Trial Room)లో కుర్తా వేసుకుని, అద్దంలో తనను తాను చూసుకుంటూ ఆ అత్తగారు మురిసిపోయిన క్షణాలను స్వాతి తన కెమెరాలో బంధించింది. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించిన అమాయకత్వం, ఆనందం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్లు ‘అత్తాకోడళ్ల బంధం అంటే ఇలా ఉండాలి’ అంటూ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పెద్దోళ్ల అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, వారి అలవాట్లను మార్చడంలో చూపించిన చొరవ నిజంగా అద్భుతమని కొనియాడుతున్నారు. ప్రస్తుతం స్వాతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వేలాది వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది.

Next Story