VIRAL: బెంగళూరులో జోరుగా వడగళ్ల వాన.. చిన్నపిల్లాడిలా మారిన మాజీ క్రికెటర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 07:07:47  IST  )

బెంగళూరులో కురిసిన వడగళ్ల వానలో టీమిండియా మాజీ పేసర్ చిన్నపిల్లాడిలా మారిపోయి సందడి చేశారు.

VIRAL: బెంగళూరులో జోరుగా వడగళ్ల వాన.. చిన్నపిల్లాడిలా మారిన మాజీ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగళూరు (Bengaluru) వాసులను వరుణుడు తడిసి ముద్దయ్యేలా చేశాడు. సిలికాన్ సిటీలో నిన్న రాత్రి ప్రకృతి వింత దృశ్యం ఆవిష్కృతమైంది. అకస్మాత్తుగా వడగళ్ల కురిసింది. అయితే, ఆ అద్భుతమైన వాతావరణాన్ని చూసి కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు, టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) పరవశించిపోయారు. వడగళ్ల వాన కురుస్తున్న సమయంలో తన కారులో ప్రయాణిస్తున్న ప్రసాద్, వర్షం జోరును చూసి కారు దిగి రోడ్డుపైకి వచ్చారు. గ్రౌండ్‌లో గంభీరంగా కనిపించే ఈ వెటరన్ క్రికెటర్, వడగళ్లను చూసి ఓ చిన్నపిల్లాడిలా మారిపోయారు. కురుస్తున్న వానలో తడుస్తూ, నేలపై పడిన వడగళ్లను చేతుల్లోకి తీసుకుని ఆనందంతో గెంతులేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఎంత పెద్దవారైనా ప్రకృతి ముందు అందరూ పిల్లలే’ అని కొందరు, ‘వెంకటేష్ ప్రసాద్ మళ్లీ తన చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోయారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బెంగుళూరులో వడగళ్ల వాన బీభత్సం

Next Story